సుందరీకరణ వైపు అడుగులు
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

సుందరీకరణ వైపు అడుగులు


అధికారులకు సూచనలిస్తున్న సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌

టెక్కలి, టెక్కలి పట్టణం : టెక్కలిని సుందరీకరణ చేసేవిధంగా ప్రణాళికా బద్ధ అడుగులు వేద్దామని సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ సూచించారు. పాతజాతీయ రహదారిపై ఆక్రమణల తొలగింపును పరిశీలించిన ఆయన డిగ్రీకళాశాల ప్రహరీగోడకు, పాతజాతీయ రహదారికి మధ్య మొక్కలు నాటడం, సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. మంగళవారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించి సూచనలు చేశారు.

* తెదేపా ప్రభుత్వ హయాంలో టెక్కలి నియోజకవర్గంలో నీరు- చెట్టు పనులు, ఇతర అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిని వెలికితీయాలని కోరుతూ వైకాపా రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి దువ్వాడ వాణి టెక్కలి సబ్‌కలెక్టర్‌కు వినతి అందించారు.

* కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ సూచించారు. టెక్కలిలోని పలు గ్రామ సచివాలయాల వద్ద నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈయన వెంట తహసీల్దార్‌ బి.నాగభూషణరావు ఎస్సై కామేశ్వరరావు, ఏపీవో ప్రసాద్‌ ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని