స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తగదు
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తగదు


ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు

పాలకొండ, న్యూస్‌టుడే: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం తగదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకునే వరకు పోరాడతామన్నారు. కార్యక్రయంలో నాయకులు కాద రాము, కేవీపీఎస్‌ నాయకులు దూసి దుర్గారావు, ఆటో సంఘ నాయకులు బి.శ్రీనివాసరావుతో పాటు జె.శ్రీనివాసరావు, వి.అప్పారావు, రామకృష్ణ, వేణు, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని