మత్స్యకారుల సంక్షేమానికి కృషి: మంత్రి
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

మత్స్యకారుల సంక్షేమానికి కృషి: మంత్రి


మడ్డువలస జలాశయంలో చేపపిల్లలను విడిచిపెడుతున్న మంత్రి అప్పలరాజు, ఇతర అధికారులు

వంగర, న్యూస్‌టుడే: జిల్లాలో మత్య్సకారుల సంక్షేమానికి కృషి చేస్తామని మంత్రి ఎస్‌.అప్పలరాజు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన(పీఎంఎంఎస్‌వై) కింద మంజూరైన చేపపిల్లలను మడ్డువలస జలాశయంలో మంగళవారం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు రూ.5.70 లక్షల విలువచేసే 4.72 లక్షల పిల్లలను విడిచిపెట్టామన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంచడానికి, సరైన మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన వారిని విడిపించి సురక్షితంగా తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. అంతకముందు ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ మడ్డువలస జలాశయం కోసం సుమారు 14 గ్రామాల ప్రజలు భూములు కోల్పోయారని మంత్రికి వివరించారు. ఈ జలాశయంలో వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్న ప్రతిఒక్కరికి మత్స్యకార సొసైటీలో సభ్యత్వం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, పింఛన్లు ముంజూరు చేయాలని కోరారు. మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మత్స్యశాఖ జె.డి. పి.వి.శ్రీనివాసరావు, పాలవలస విక్రాంత్‌, ఆర్డీవో కుమార్‌, మండల ప్రత్యేకాధికారి జయప్రకాశ్‌, ఎంపీడీవో త్రినాథ్‌, తహసీల్దార్‌ ఐజాక్‌, మండల వైకాపా నాయకులు సురేష్‌ముఖర్జి, కరణం సుదర్శనరావు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని