ఫలితాలు విడుదల చేయకుండా మళ్లీ పరీక్షలా?
eenadu telugu news
Published : 04/08/2021 03:50 IST

ఫలితాలు విడుదల చేయకుండా మళ్లీ పరీక్షలా?


రిజిస్ట్రార్‌కు వినతపత్రం అందజేస్తున్న ఏబీవీపీ నాయకులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సంబంధించి పునర్‌మూల్యాంకన ఫలితాలు వెల్లడించాక త్వరలో జరగబోయే సెమిస్టర్‌ పరీక్షలకు రుసుములు కట్టించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వర్సిటీలో మంగళవారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంగోటి పులిరాజు, వంశీకుమార్‌, రాజేష్‌, రమేష్‌ తదితరులు రిజిస్ట్రార్‌ డా.తమ్మినేని కామరాజును కలిసి వినతపత్రం అందజేశారు. రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్‌ పరీక్షల పునర్‌ మూల్యాంకనానికి వందల మంది విద్యార్థులు రుసుములు చెల్లించారని, వీటి ఫలితాలు విడుదల చేయకుండా మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్‌ విడుదల చేయటమేంటని ప్రశ్నించారు. తొలుత పునర్‌మూల్యాంకన ఫలితాలు విడుదల చేయాలని కోరారు.

బకాయిలు విడుదల చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ప్రభుత్వం విద్యా, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) వర్సిటీ శాఖ అధ్యక్షుడు పాలం నాసరయ్య డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మంగళవారం విద్యాదీవెన, వసతి దీవెన లోటుపాట్లపై చర్చించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతిపేద విద్యార్థికి ఈ పథకాలు వర్తింపజేయాలన్నారు. గత ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు బోధనా రుసుము అందజేయగా ఈ ప్రభుత్వం కేవలం పది లక్షల మందికి మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. మట్టా రవి, రాజు పాల్గొన్నారు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని