Published : 04/08/2021 04:13 IST

ధరల పెరుగుదలపై తెదేపా నిరసన


నరసన్నపేటలో తెదేపా నాయకుల ర్యాలీ 

నరసన్నపేట, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం దోపిడీ విధానంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రజాగ్రహంలో ఈ ప్రభుత్వం కూలడం తథ్యమని పార్లమెంట్‌ నియోకవర్గ తెదేపా అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా మంగళవారం నరసన్నపేటలో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక, మట్టి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇరుకు ఇళ్లు జీవనానికి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జేట్యాక్స్‌ రూపంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయ ని ఆరోపించారు. స్థానిక జట్టు కళాశీ యూనియన్‌ కార్యాలయ ఆవరణలోని దివంగత నేత ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ప్రదర్శన సాగింది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, పీఎంజే బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షులు తమ్మినేని సుజాత, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని