ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
eenadu telugu news
Published : 04/08/2021 04:13 IST

ఏర్పాట్లు పక్కాగా ఉండాలి


వడుకు ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎస్పీ అమిత్‌ బర్దార్‌ 

పొందూరు, పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 7న పొందూరు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎస్పీ అమిత్‌ బర్దార్‌ పేర్కొన్నారు. మంగళవారం పొందూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణ, ఖాదీ పరిశ్రమ వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఖాదీ పరిశ్రమ పరిశీలన అనంతరం మార్కెట్‌ యార్డు ఆవరణలో వివిధ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. చేనేత, ఖాదీ సంస్థలు, కార్మికులకు రుణాల చెక్కులను అందిస్తారని చెప్పారు. పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి భద్రతా చర్యలపై డీఎస్పీ మహేంద్ర, ఎస్‌.ఐ. లక్ష్మణరావులకు సూచనలు చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టరు సమ్లీక్ష సమావేశంలో నిర్వహించి పలు సూచనలు చేశారు. కేంద్ర పథకాలకు సంబంధించిన అన్ని వివరాలు ఉండాలన్నారు. బ్యాంకులు సైతం తమ కార్యకలాపాలపై స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ సుమిత్‌ కుమార్‌, డీఆర్‌వో బి.దయానిధి, ఆర్డీవో ఐ.కిశోర్‌, డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం బి.గోపాలకృష్ణ, యూబీఐ జోనల్‌ మేనేజర్‌ శివవరప్రసాద్‌, ఎల్‌డీఎం హరిప్రసాద్‌, నబార్డు డీడీఎం మిలింద్‌ చౌసల్కర్‌, ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్‌ తపోధన్‌ దెహరీ, డీసీసీబీ సీఈవో దత్తి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని