అక్రమాలకు తావులేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌
eenadu telugu news
Published : 19/09/2021 05:07 IST

అక్రమాలకు తావులేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌

రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌, ఐజీ శేషగిరిబాబు

ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న శేషగిరిబాబు

బలగ(శ్రీకాకుళం), పోలాకి, న్యూస్‌టుడే: రిజిస్ట్రేషన్‌ శాఖలో క్రయవిక్రయాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్‌, ఐజీ శేషగిరిబాబు తెలిపారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శ్రీకాకుళం నగరంలోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాఖాపరంగా అందించే సేవలు పారదర్శకంగా ఉండాలన్నారు. క్రయవిక్రయాలకు ప్రస్తుతం సాంకేతిక ఇబ్బందులు ఏమీ లేవన్నారు. ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో తొలుత క్రయ విక్రయాలు జరిపి, వాటి ఫలితం ఆధారంగా అన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌శాఖ సేవలు విస్తరించనున్నట్లు వివరించారు. అంతకముందు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సందర్శించి పలు దస్త్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఐజీ ఉదయభాస్కర్‌, జాయింట్‌ ఐజీ సరోజ, జిల్లా రిజిస్ట్రార్‌ ఆర్‌.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అంతకముందు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను మబుగాంలో శేషగిరిబాబు కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో డిప్యూటీ సీఎం సమీక్షను నిర్వహించారు. నకిలీ చలానాల కేసుల విషయమై తాజా పరిస్థితులపై ఆయనను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో పొరపాట్లకు తావివ్వకుండా ఉండేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని