ప్రారంభించని 3,885 పనులు రద్దు
eenadu telugu news
Published : 19/09/2021 05:07 IST

ప్రారంభించని 3,885 పనులు రద్దు

పాతపట్నం, న్యూస్‌టుడే: ప్రారంభించని 3,885 మినీ గోకులాల పనులను రద్దు చేసినట్లు పశుసంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.కిశోర్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం పాతపట్నం పశుసంవర్ధకశాఖ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పాడి పశువులు పెంపకాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మినీ గోకులాలు ఈ ఏడాది మార్చిలో సర్వే చేపట్టామన్నారు. ఇందులో 6,326 పనులు గుర్తించామని, అప్పటికే 3,885 పనులు ప్రారంభించకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు తెలిపారు. పూర్తయిన వాటికి బిల్లులు మంజూరు చేస్తామని చెప్పారు. అంతకుముందు కాగువాడ, బూరగాం రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. ఆయా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సహాయ సంచాలకులు ఎం.లోకనాథం, బి.శ్రీవాణి సిబ్బంది ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని