అన్ని జాగ్రత్తలూ తీసుకోండి: ఎస్పీ
eenadu telugu news
Published : 19/09/2021 05:07 IST

అన్ని జాగ్రత్తలూ తీసుకోండి: ఎస్పీ

కాశీబుగ్గ, పాతపట్నం, న్యూస్‌టుడే: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని పోలీసు అధికారులకు ఎస్పీ అమిత్‌బర్దార్‌ సూచించారు. పలాసలోని కౌంటింగ్‌ కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు. ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. బందోబస్తుకు సంబంధించి డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ శంకరరావులకు ఆయన పలు ఆదేశాలిచ్చారు. కాగా ఆదివారం జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలలో పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. పాతపట్నంలోని లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని