జిల్లా విద్యాశాఖాధికారిగా వెంకటేశ్వరరావు
eenadu telugu news
Published : 19/09/2021 05:41 IST

జిల్లా విద్యాశాఖాధికారిగా వెంకటేశ్వరరావు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖాధికారిగా డా.నాగిరెడ్డి వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన జిల్లాలోని రాజాం ప్రాంతానికి చెందినవారు. చాలాకాలం కిందట ఏలూరు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కృష్టా జిల్లాలోని అంగలూరు డైట్‌ కళాశాలలో 1993 నుంచి 2000 వరకు అధ్యాపకునిగా చేశారు. 2000 నుంచి ఇప్పటి వరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ బీఈడీ కళాశాలలో సీనియర్‌ అధ్యాపకులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ప్రస్తుతం డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జి.పగడాలమ్మ డీఈవో కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ఉప విద్యాశాఖాధికారిణిగా కొనసాగనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని