వివరాల నమోదు తప్పనిసరి
eenadu telugu news
Published : 19/09/2021 05:41 IST

వివరాల నమోదు తప్పనిసరి


మాట్లాడుతున్న డీఐ లావణ్య

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: కొవిడ్‌కు సంబంధించిన మందుల అమ్మకాల వివరాలను ప్రభుత్వం సూచించిన సీపీఏపీ కొవిడ్‌ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.లావణ్య సూచించారు. టెక్కలి డ్రగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం టెక్కలిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మందుల దుకాణదారులు కొవిడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కొనుగోలుదారుడి చిరునామా, చరవాణి నంబరును తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు. ముందస్తుగా కొవిడ్‌ అనుమానితులను గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే దుకాణాల లైసెన్స్‌లు రద్దుచేస్తామని హెచ్చరించారు. ఇటీవల మృతిచెందిన సంఘ సభ్యుడు చొక్కాకుల సూర్యనారాయణ మృతికి అసోసియేషన్‌ తరఫున సంతాపం తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి డ్రగ్‌ట్రేడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శిష్టు జగం, పలువురు మందుల దుకాణాల యజమానులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని