‘అధికార దాహంతో అలజడి సృష్టిస్తున్న చంద్రబాబు’
eenadu telugu news
Published : 19/09/2021 05:41 IST

‘అధికార దాహంతో అలజడి సృష్టిస్తున్న చంద్రబాబు’


మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ కారెం శివాజీ

అరసవల్లి, న్యూస్‌టుడే: అధికార దాహంతో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో శనివారం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. అయ్యన్నపాత్రుడిని చంద్రబాబు కావాలనే ప్రేరేపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మనకు పరిశ్రమలు రాకుండా తెదేపానే అడ్డుకుందని ఆరోపించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలను క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని