సిక్కోలు వాసులు రాణించడం గర్వకారణం
eenadu telugu news
Published : 19/09/2021 05:41 IST

సిక్కోలు వాసులు రాణించడం గర్వకారణం


క్లాప్‌ కొట్టి సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తున్న మంత్రి అప్పలరాజు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: ఈ మధ్య కాలంలో సిక్కోలు నుంచి పలువురు సినిమా రంగంలో రాణిస్తుండడం గర్వకారణమని, ఈ ప్రాంతం అన్ని విధాలా మరింత గుర్తింపు పొందగలదని మంత్రి సీదిరి అప్పలరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. వజ్రపుకొత్తూరులో వెలిసిన కొత్తూరు పోలమ్మ ఆలయంలో శనివారం స్థానిక యువకుడు తిమ్మల కిరణ్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్న ‘గీత’ సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ మూహూర్తం సన్నివేశానికి హీరో, హీరోయిన్‌లపై మంత్రి క్లాప్‌ కొట్టారు. అంతకు ముందు గ్రామదేవతలకు పూజలు చేశారు. సర్పంచి పుక్కళ్ల ధనలక్ష్మీ, గురయ్యనాయుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు హేమంత్‌, హీరో అభిచిత్రమ్‌, హీరోయిన్‌ శ్రీజ, నిర్మాత రాము, బృందం పాల్గొన్నారు.

కుట్రలను తిప్పికొట్టాలి...కాశీబుగ్గ: ప్రతిపక్ష నేతల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి అప్పలరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాశీబుగ్గలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షం ఎన్నికలు ఆపడానికి ప్రయత్నించిందని, చివరకు ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలుపొందాక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని