ఈత పోటీల్లో పతకాల పంట
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

ఈత పోటీల్లో పతకాల పంట

వాన సునీత

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా క్రీడాకారులు 21 పతకాలు సాధించినట్లు జిల్లా స్విమ్మింగ్‌ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.హారికాప్రసాదరావు, ఎం.విష్ణుమూర్తి తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో గత రెండురోజులుగా జరుగుతున్న ఈత పోటీల్లో సీనియర్‌ విభాగంలో వాన సునీత 2 స్వర్ణాలు, 3 రజతాలు సొంతం చేసుకుంది. జూనియర్‌ విభాగంలో నవ్యశ్రీ 1 కాంస్యం దక్కించుకుంది. సబ్‌జూనియర్‌ విభాగంలో దీక్షాబెహర 6 స్వర్ణాలు, పి.హర్షిత స్వర్ణం, కాంస్యం, జి.వేదార్ష రజతం, 2 కాంస్యాలు, బోణి ఆశ్వద్థ 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించారు.   ఆదివారంతో పోటీలు పూర్తికావాల్సి ఉండగా వర్షం కారణంగా సోమవారానికి వాయిదా వేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, శిక్షకులు డి.మురళీధర్‌ను సంఘ కార్యనిర్వాహణ కార్యదర్శి కాంతారావు, సెట్‌శ్రీ సీఈవో కె.ఎస్‌.ప్రభాకరరావు, డీఎస్‌డీవో బి.శ్రీనివాస్‌కుమార్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.సుందరరావు అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని