ఆదిత్యాయ నమః
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

ఆదిత్యాయ నమః

రసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం సామూహిక యోగా, సూర్య నమస్కారాలు నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని సూర్యయోగ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు తంగి స్వాతి ఆధ్వర్యంలో సుమారు 80 మంది యోగాసనాలు వేశారు. సుమారు 3 గంటల పాటు సూర్య నమస్కారాలు చేశారు. కార్యక్రమంలో యోగా, ఆయుర్వేద వైద్యులు మాణికేశ్వరరావు, సూర్యయోగ ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.లుగేంద్ర పిళ్లై, యోగా ఆయుర్వేద నిపుణులు, చిన్మయి ట్రస్టు వ్యవస్థాపకులు పరమాత్మనందస్వామీజీ, విశ్రాంత జిల్లా జడ్జి పప్పల జగన్నాథరావు, బొడ్డేపల్లి దక్షిణామూర్తి, ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈవో సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, అరసవల్లి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని