ఏపీ ఈసెట్‌కు 673 మంది హాజరు
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

ఏపీ ఈసెట్‌కు 673 మంది హాజరు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్‌-2021 ప్రవేశ పరీక్ష ఎచ్చెర్ల మండలంలో ఆదివారం రెండు కేంద్రాల్లో జరిగింది. శ్రీశివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో 360 మందికి గాను 342, శ్రీవెంకటేశ్వరలో 345కి 331 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు కేంద్రాల్లో మొత్తం 705 మందికి 673 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని