రహదారి ప్రమాదంలో వృద్ధుడి మృతి
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

రహదారి ప్రమాదంలో వృద్ధుడి మృతి

ఘటనా స్థలంలో ఢీకొన్న కార్లు

బూర్జ, న్యూస్‌టుడే: బూర్జ మండలంలోని నీలాదేవిపురం కూడలి ప్రధాన రహదారిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.  విజయనగరం జియ్యమ్మవలస మండలం గడిసింగుపురానికి చెందిన బౌరోతు వెంకటనాయుడు, బౌరోతు విజయలక్ష్మీ, పాలవలస పద్మావతి, పాలవలస అచ్చెమ్మ, వి.మణికంఠ కారులో అరసవల్లి దేవస్థానానికి వెళ్లేందుకు కారులో బయలు దేరారు. మండలంలోని నీలాదేవిపురం కూడలి వద్దకు రాగానే వీరి వాహనం శ్రీకాకుళం నుంచి వస్తున్న మరో కారు పరస్పరం ఢీ కొన్నాయి. ప్రమాదంలో వెంకటనాయుడు(91) సంఘటనా స్థలంలో మృతి చెందారని 108 సిబ్బంది తెలిపారు. గడిసింగుపురానికి చెందిన వారితో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాలకొండ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. వెంకటనాయుడు మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై వెంకటసురేశ్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని