‘ఎన్నికుట్రలు చేసినా న్యాయమే గెలిచింది’
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

‘ఎన్నికుట్రలు చేసినా న్యాయమే గెలిచింది’

మిఠాయి తినిపిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కృపారాణి

అరసవల్లి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసినా న్యాయమే గెలించిందని వైకాపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా గెలుపును ఎవరూ ఆపలేకపోయారన్నారు. పరువు కాపాడుకునేందుకే తెదేపా ఎన్నికలను బహిష్కరించిందని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తిని సమాజానికి దూరంగా ఉంచాలని డిమాండు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పేరెత్తే అర్హత కూడా ఆయనకు లేదన్నారు. అనంతరం ప్రాదేశిక పోరుల్లో విజయఢంకా మోగించినందుకు బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. సమావేశంలో వైకాపా నాయకులు అంధవరపు సూరిబాబు, ఎం.వి.పద్మావతి, ఎన్ని ధనుంజయరావు, చౌదరి సతీష్‌, మైలపల్లి మహాలక్ష్మీ, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని