ఉత్సాహంగా హ్యాండ్‌బాల్‌ పోటీలు
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

ఉత్సాహంగా హ్యాండ్‌బాల్‌ పోటీలు

ఎంపికైన జిల్లా జట్టు సభ్యులు

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: హ్యాండ్‌బాల్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెప్టంబరు 21న విజయవాడలో సబ్‌జూనియర్‌ బాలురు విభాగంలో రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఎచ్చెర్ల మండలం అల్లినగరం జడ్పీ హైస్కూల్‌లో శ్రీకాకుళం జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులను రాష్ట్ర, జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సుంకరి కృష్ణకుమార్‌, జిల్లా కార్యదర్శి ఎం.ఎస్‌.చంద్రశేఖర్‌ అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని