పేద కళాకారులకు నిత్యావసరాల పంపిణీ
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

పేద కళాకారులకు నిత్యావసరాల పంపిణీ

సరకులు అందజేస్తున్న దాతలు

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రసిద్ధ కళాకారుడు మెండ అప్పారావు జ్ఞాపకార్థం నగరంలో ఓ బహుళ అంతస్తుల భవనం ఆవరణలో ఆదివారం పేద కళాకారులకు నిత్యావసర సరకుల పంపిణీ చేసినట్లు సినట్లు మెండ చంద్రశేఖరం, మెండ ప్రభాకరరావు తెలిపారు. సూత్రా ఫౌండేషన్‌ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో నిక్కు రాములమ్మ, ఎల్‌.నందికేశ్వరరావు, నిక్కు హరి సత్యనారాయణ, నంది పురస్కార గ్రహీత కేశిరెడ్డి రాజేశ్వరి, బి.ఎం.ఎస్‌.పట్నాయక్‌, యామిజాల గాయత్రి, గాయత్రి మూర్తి,ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

లెప్రసీ కాలనీలో... అక్షర శిల్పి వాడపల్లి సుబ్రహ్మణ్యశర్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని లెప్రసీ కాలనీలో ఆదివారం చంద్రజా కల్చరల్‌ అండ్‌ ఛారిటీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, మందుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకురాలు, రచయిత్రి వాడపల్లి చంద్రజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో స్వామి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని