బాలవికాస్‌ కేంద్రం ప్రారంభం
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

బాలవికాస్‌ కేంద్రం ప్రారంభం

కార్యక్రమంలో పాల్గొన్న పరాత్మానంద స్వామి, తదితరులు

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పిల్లల్లో మానసిక వికాసం, మానవీయ విలువలు, సేవాభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు బాలవికాస్‌ కేంద్రాలు దోహదపడతాయని చిన్మయ మిషన్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు పరాత్మానంద స్వామీజీ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్‌బేగ్‌పేటలో సద్గురు సాయి గీతామందిరంలో నూతనం ఏర్పాటు చేసిన బాలవికాస్‌ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. కార్యక్రమంలో గీతామందిరం ప్రతినిధులు పన్నాల నరసింహమూర్తి, పి.గణేష్‌, జె.శిమ్మన్న, ఎస్‌.వెంకటరమణ, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని