ఉత్కంఠకు తెర
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

ఉత్కంఠకు తెర

చెదలు పట్టిన స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలిస్తున్న జిల్లా జాయింట్‌కలెక్టర్‌ శ్రీనివాసులు

పలాస, కాశీబుగ్గ, మందస, వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే:    పలాస నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరపడింది. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటిసీ అభ్యర్థుల ఫలితాలు ఆదివారం పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అధికారులు వెల్లడించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఇనిషియల్‌ కౌంటింగ్‌ ఉదయం 10.30గంటల కల్లా పూర్తి చేశారు. రౌండ్ల వారీగా అధికారులు టేబుళ్ల నుంచి లెక్కింపు పూర్తిచేసి ఒక్కో ఎంపీటీసి స్థానాన్ని ప్రకటించారు. మందస మండలం రాంపురం పంచాయతీ పోలింగ్‌ కేంద్రం 81 బ్యాలెట్‌బాక్సులో చెద పట్టడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించి చెద పట్టిన ఓట్లను లెక్కింపు చేయకుండా పక్కన పెట్టారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, జిల్లాల అడిషనల్‌ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్‌ ఎన్నికల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి సూచనలు చేశారు. వైకాపా అభ్యర్థులు విజయదుందుభి మ్రోగించారని పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం అధ్యక్షుడు గిరిబాబు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని