ఫలితాల వెల్లడిలో జాప్యం
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

ఫలితాల వెల్లడిలో జాప్యం

ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. పురుషోత్తపురం ఏపీ ఆదర్శపాఠశాల కేంద్రంలో ఓట్ల లెక్కింపు కోసం విడివిడిగా గదులు అయితే కేటాయించారు గానీ, ఇతరత్రా సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. తొలి లెక్కింపులో మూడు స్థానాలలో తెదేపా, మూడింట వైకాపా ఆధిక్యం కనబరిచాయి. తెదేపా విజయంపై ప్రకటన ఆలస్యం చేయడంతో ఆ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఓట్లను బండిల్స్‌గా మార్చే ప్రక్రియను నింపాదిగా చేశారు. దాంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లెక్కింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని