పాతపట్నం నియోజకవర్గంలో వైకాపాదే మెజార్టీ
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

పాతపట్నం నియోజకవర్గంలో వైకాపాదే మెజార్టీ

పాతపట్నం, న్యూస్‌టుడే:  నియోజకవర్గంలోని పాతపట్నం, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, కొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు సంబంధించి 75 ప్రాథమిక స్థానాలు ఉన్నాయి. 75 స్థానాలకుగాను కొత్తూరు మండలం దిమిలి, హిరమండలం మండలం హిరమండలం-3 ప్రాదేశికాల్లో ఉండే అభ్యర్థులు ఇద్దరు మృతి చెందారు. మిగతా స్థానాలకు పోటీలు జరగ్గా వైకాపా పార్టీ నుంచి పోటీ చేసి 56 మంది గెలుపొందారు. తెదేపా నుంచి పోటీ చేసిన వారిలో 12 మంది గెలుపొందారు. పాతపట్నం మండలం పాతపట్నం 1, పాతపట్నం 4 ప్రాదేశికాల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే హిరమండలం మండలం హిరమండలం-3 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హిరమండలం మండలానికి చెందిన తెదేపా అభ్యర్థి దారపు నారాయణరావు మృతి చెందడంతో జెడ్పీటీసీˆ ఎన్నికలు రద్దయ్యాయి. కొత్తూరు మండలం మాతల ప్రాదేశికంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి భార్య కలమట ఇందిర పోటీ చేసి గెలుపొందారు. అలాగే గురండి ప్రాదేశికంలో తెదేపా నాయకుడు బైరాగినాయుడు పోటీ చేసి స్వల్పంగా 12 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. స్వల్ప మెజార్టీ కావడంతో మళ్లీ లెక్కింపు చేపట్టాలని వైకాపా నాయకులు డిమాండు చేశారు. దీంతో మళ్లీ కౌంటింగ్‌ చేపట్టినప్పటికీ 12 ఓట్లుతో గెలుపొందినట్లు నిర్ధారించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని