యువత సమస్యలను పట్టించుకోరా..?:నాదెండ్ల
eenadu telugu news
Published : 21/09/2021 05:27 IST

యువత సమస్యలను పట్టించుకోరా..?:నాదెండ్ల

మాట్లాడుతున్న నాదెండ్ల మనోహర్‌, చిత్రంలో ఇతర నాయకులు

అరసవల్లి, న్యూస్‌టుడే: యువత సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకోలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. 25 కిలోల బియ్యం ఇచ్చేస్తే సరిపోదని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలన్నారు. కొల్లివలసలో జనసేన అభ్యర్థి ఎంపీటీసీగా గెలిచారని, వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో జిల్లాలో వందకు పైగా స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు పురపాలికల్లో కూడా విజయం సాధిస్తామన్నారు. తిత్లీ తుపాను సమయంలో ఇక్కడి ప్రజలకు సేవలు అందించే అవకాశం కలిగిందని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా సాగలేదని విమర్శించారు. త్వరలో మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్ఛాపురంలో ఇటీవల మృతి చెందిన జనసేన సభ్యుడు నీలాపు శ్రీను కుటుంబానికి పార్టీ తరఫున బీమా మొత్తం రూ.5 లక్షల చెక్కును బెల్లుపడలోని బాధిత కుటుంబానికి నాదెండ్ల అందించారు. అనంతరం ఇచ్ఛాపురం బస్టాండులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల ఆమదాలవలస నియోజకవర్గ జనసేన కన్వీనర్‌ పేడాడ రామ్మోహన్‌నాయుడిపై దాడి చేసిన విషయం విదితమే. ఆయన్ను నాదెండ్ల పరామర్శించారు. పార్టీ నాయకులు గేదెల చైతన్య, కోరాడ సర్వేశ్వరరావు, యశస్వి, విశ్వేక్సేన్‌, గురుప్రసాద్‌, కాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని