ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది: కూన
eenadu telugu news
Published : 21/09/2021 05:27 IST

ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది: కూన

మాట్లాడుతున్న రవికుమార్‌, చిత్రంలో ఇతర నాయకులు

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు. ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు పూర్తిగా వైకాపా నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఒక్క సీటు కూడా వైకాపాకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. వైకాపా పాలనలో ప్రజల్లో విసిగిపోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నూక రాజు, నాయకులు సనపల డిల్లేశ్వరరావు, రామశంకర్‌, ఇటీవల విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని