తప్పని ఆధార్‌ కష్టాలు
eenadu telugu news
Published : 21/09/2021 05:27 IST

తప్పని ఆధార్‌ కష్టాలు

ప్రజలకు ఆధార్‌ కష్టాలు తప్పట్లేదు. వీరఘట్టం మండలంలో ఇటీవల అధికారులు సచివాలయంలో ఇటీవల ఆధార్‌ కేంద్రం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. కాన్నీ సిబ్బంది ఒక్కరే ఉండటంతో ముందస్తుగా టోకెన్లు ఇచ్చి రోజుకు 20 మందికి మాత్రమే ఆధార్‌ అనుసంధానం, ఈకేవైసీ నమోదు, తదితర సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పెద్దలతో పాటు పాఠశాలలో వేలి ముద్రలు పడని పిల్లలు ఇలా వారి తల్లిదండ్రులతో సహా పెద్ద ఎత్తున సచివాలయం వద్దకు ఉదయం 5.30 గంటలకే చేరుకున్నారు. అధికారులు వచ్చేంతవరకు బారులు తీరి గంటల పాటు నిరీక్షించారు.

- న్యూస్‌టుడే, వీరఘట్టం గ్రామీణం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని