అర్జీలు సత్వరం పరిష్కరించాలి
eenadu telugu news
Published : 21/09/2021 05:27 IST

అర్జీలు సత్వరం పరిష్కరించాలి

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, చిత్రంలో జేసీలు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ఎన్నో వ్యయ ప్రయాశలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నారని, వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో జేసీలు సుమిత్‌కుమార్‌, కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములునాయుడు, హిమాంశు కౌశిక్‌, డీఆర్వో బి.దయానిధితో కలసి ఆయన అర్జీలు స్వీకరించారు. పంచాయతీరాజ్‌, రెవెన్యూ, వ్యవసాయ, మున్సిపల్‌, ఐసీడీఎస్‌ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా పెండింగులో ఉన్నాయని, వీటి పరిష్కారానికి తక్షణం దృష్టిపెట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల మండలం లక్ష్ముడుపేటకు చెందిన ఎస్‌.జగన్మోహనరావుకు వినికిడి పరికరం అందజేశారు. మొత్తం 211 వినతులు వచ్చాయని చెప్పారు. తన భూమిని ఆక్రమించుకున్నారని పాతపట్నం మండలానికి చెందిన శ్రీలక్ష్మి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా వెంటనే తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బడ్జెట్‌ విడుదలైనా గత 16 నెలలుగా జీతాలు విడుదల చేయలేదని 104 వాహన ఉద్యోగులు విన్నవించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని