ఇక నిరీక్షించి..
eenadu telugu news
Published : 21/09/2021 05:27 IST

ఇక నిరీక్షించి..

తమ అవస్థను ఎవరైనా పట్టించుకుంటారేమోనని ఇంతకాలం వేచిచూశారు. ఏళ్లు గడుస్తున్నాయి.. ఎదురుచూసి కళ్లు కాయలు కాస్తున్నాయ్‌.. కానీ కన్నెత్తి చూసేవారే లేరు. చేసేది లేక వారే ఓ నిర్ణయానికొచ్చారు. సమస్యకు తాత్కాలిక పరిష్కారం కనుగొన్నారు. సీతంపేట మండలంలోని వెంపలగూడ-రేగులగూడ మధ్య వంతెన తిత్లీతుపాను సమయంలో కూలిపోయింది. అప్పటి నుంచి రేగులగూడ కాలనీ, పాత రేగులగూడ, ఈతమానుగూడ, తదితర గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇటీవల వర్షాలకు వాగు గుండా వరద నీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో టేకు, ఇతర కర్రలతో తాత్కాలికంగా సోమవారం ఇలా వంతెన నిర్మించే పనుల్లో నిమగ్నమయ్యారు. సర్పంచి సవర బాజన్న, స్థానికులు ఇంటికొకరు చొప్పున స్వచ్ఛందంగా వంతెన కర్రలతో వంతెన నిరించుకున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పూర్తిస్థాయి వంతెన ఏర్పాటు చేసి కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.- న్యూస్‌టుడే, సీతంపేట


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని