విద్యతోనే మహిళలకు ఆర్థిక స్వావలంబన
eenadu telugu news
Published : 21/09/2021 05:27 IST

విద్యతోనే మహిళలకు ఆర్థిక స్వావలంబన

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: మహిళలు విద్యావంతులైతే ఆర్థిక స్వావలంబన, దేశ పురోభివృద్ధి సాధ్యమవుతుందని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఉప కులపతి నిమ్మ వెంకటరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌, వర్సిటీ, సైబర్‌ సీడ్‌ ఫౌండేషన్‌ సంస్థ సంయుక్తంగా డిజిటల్‌ శక్తి-డేటా ప్రైవసీ అండ్‌ సోషల్‌ మీడియా సేఫ్టీ అనే అంశంపై వర్చువల్‌ విధానం వెబినార్‌ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల భద్రతకు దిశా చట్టాన్ని, యాప్‌ను తీసుకొచ్చిందన్నారు. సైబర్‌ పీస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి జనీస్‌ వర్గీస్‌ మాట్లాడుతూ బాలికలు, యువతులు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి ఐ.ఎల్‌.నరసింహారావు, సోషల్‌ వర్క్‌ విభాగం సహాయ ఆచార్యులు యు.కావ్యజోత్స్న, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని