సంక్షేమ పథకాలు నిలిపేయడం తగదు
eenadu telugu news
Published : 21/09/2021 05:51 IST

సంక్షేమ పథకాలు నిలిపేయడం తగదు

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు, నాయకులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: తమకు అమలవుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడం అన్యాయమని, ఇందుకు సంబంధించి విడుదల చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మికులు డిమాండు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సిటు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా సంక్షేమ బోర్డు ద్వారా ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు. పథకాలు అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి నష్టం లేదన్నారు. బోర్డుకు బడ్జెట్‌లో ఇప్పటివరకు నిధులు కేటాయించలేదన్నారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హరనాథ్‌, సిటు జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్దనరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని