గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్‌
eenadu telugu news
Published : 21/09/2021 05:51 IST

గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్‌

దూరదృశ్య సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఇతర అధికారులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మండల గృహనిర్మాణ అధికారులతో సోమవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణాలపై శ్రద్ధ వహించాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మౌలిక వసతుల కల్పనలో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీలు సుమిత్‌కుమార్‌, కె.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్‌, గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.గణపతి, డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు, ఆర్డీవో ఐ.కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

జంతువుల సంరక్షణకు కృషి..: జంతువుల సంరక్షణకు కృషి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జంతుసంక్షేమ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జంతువుల అక్రమ రవాణా అరికట్టాలన్నారు. సోంపేట మండలం రామచంద్రాపురం వద్ద మంజూరు చేసిన గోశాలకు అవసరమైన వసతుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సమావేశంలో జేసీ సుమిత్‌కుమార్‌, జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, డీపీవో వి.రవికుమార్‌, పశుసంవర్థక శాఖ జేడీ ఎం.కిశోర్‌, మార్కెటింగ్‌ శాఖ ఏడీ బి.శ్రీనివాసరావు, గ్రీన్‌మెర్సీ సీఈవో కె.రమణ, బారువ గోశాల నిర్వాహకులు రమణమూర్తి, రాష్ట్ర గోరక్షణ సమాఖ్య అధ్యక్షుడు జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని