జడ్పీ పీఠం కేటాయించాలని డిమాండు
eenadu telugu news
Published : 21/09/2021 05:55 IST

జడ్పీ పీఠం కేటాయించాలని డిమాండు

మాట్లాడుతున్న చంద్రమోహన్‌

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ పదవిని తూర్పుకాపులకు కేటాయించి రాజకీయంగా తగు ప్రాధాన్యం కల్పించాలని ఆ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ కోరారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో తూర్పుకాపులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ అధ్యక్ష పదవి విషయంలో గత ప్రభుత్వం తమకు ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరారు. నాయకులు వి.జగన్నాథంనాయుడు, ఎం.పుండరీకం, ఎల్‌.అప్పలనాయుడు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని