కరోనా కట్టడికి టీకాయే మార్గం
eenadu telugu news
Published : 26/09/2021 04:00 IST

కరోనా కట్టడికి టీకాయే మార్గం

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌ రావు


వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌.రఘునందన్‌ రావు

శ్రీకాకుళం లీగల్‌, న్యూస్‌టుడే: కరోనా వ్యాప్తి కట్టడికి టీకా ఒక్కటే మార్గమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, శ్రీకాకుళం జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌ రావు పేర్కొన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా బార్‌ అసోసియేషన్‌ భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలన్నారు. జిల్లాలోని కోర్టుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఇటీవల ప్రారంభించిన స్పెషల్‌ కోర్టు ఫర్‌ ట్రయల్‌ ఆఫ్‌ ఏజెన్సీస్‌ అఫెన్సెస్‌ అగైనెస్ట్‌ ఉమెన్‌, స్పెషల్‌ కోర్టు ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌ కోర్టులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శిష్ఠు రమేష్‌, అదనపు జిల్లా జడ్జిలు వెంకటేశ్వర్లు, పి.అన్నపూర్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు కె.నాగమణి, ఎం.అనురాధ, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఎం.శ్రీలక్ష్మి, కె.రాణి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు చిన్నాల జయకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని