ముగ్గురు సర్పంచుల చెక్‌పవర్‌ రద్దు
eenadu telugu news
Published : 26/09/2021 04:15 IST

ముగ్గురు సర్పంచుల చెక్‌పవర్‌ రద్దు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: ఉపాధి బిల్లుల చెల్లింపుల్లో కోర్టు ఆదేశాలు ధిక్కరించిన ముగ్గురు సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేసినట్లు డీపీవో వి.రవికుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి పనులు నిర్వహించిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా సర్పంచులు, పలువురు కార్యదర్శులు కలిసి వాటిని డ్రా చేసేస్తున్నారని ఈనెల 23న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు బిల్లులు చెల్లించకుండా ధిక్కారానికి పాల్పడిన బడివానిపేట సర్పంచ్‌ కారి చినపాపారావు, కిట్టాలపాడు సర్పంచ్‌ గొంటి ప్రభావతి, అంబావల్లి సర్పంచ్‌ గూడేన శంకరరావుకు చెక్‌ పవర్‌ రద్దు చేశారు. జిల్లాలో 3,098 ఉపాధి పనులకు రూ.57.78 కోట్లు చెల్లించాల్సి ఉందని డీపీవో అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని