పెళ్లి వద్దని.. పాఠశాలలో చేరి..!
eenadu telugu news
Published : 26/09/2021 04:15 IST

పెళ్లి వద్దని.. పాఠశాలలో చేరి..!

పలాస, న్యూస్‌టుడే: అమ్మ లేని లోటు... చదువుకోవాలనే ఆసక్తి... కానీ బంధువులంతా పెళ్లి చేసేందుకు సిద్ధమవటంతో అమ్మమ్మ ఇంట్లో తలదాచుకుని, నేను చదువుకుంటానంటూ... అధికారుల సాయంతో మళ్లీ బడిమెట్లెక్కిన బాలిక ఉదంతమిది. పోలాకి కేజీబీవీలో గతేడాది సదరు బాలిక 9వ తరగతి చదివింది. తల్లిలేకపోవటం.. తండ్రి ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్న ఈ బాలికకు బంధువులు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. చదువుపై మక్కువతో అక్కడ నుంచి పారిపోయి పలాసలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న గర్ల్‌ఛైల్డ్‌ అభివృద్ధి అధికారిణి ఆర్‌.కరుణ, పాఠశాల ప్రత్యేకాధికారిణి ఎం.సూర్య, పి.ఇ.టి. నారీగ్రేస్‌లు బాధితురాలు ఉంటున్న ఇంటికెళ్లి మాట్లాడారు. పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయుడిని సంప్రదించి 10వ తరగతిలో చేరేలా ఏర్పాటు చేశారు. దీంతో శనివారం పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.తులసీరావు విద్యార్థినికి పుస్తకాలు, బ్యాగులు అందించి మంచి ర్యాంకు సాధించాలని అభినందించారు. చిట్టిబాబు సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని