తప్పిన ప్రమాదం
eenadu telugu news
Published : 26/09/2021 05:53 IST

తప్పిన ప్రమాదం

పొలంలోకి ఒరిగిన పాఠశాల బస్సు

ఎల్‌ఎన్‌పేట, న్యూస్‌టుడే: ఎల్‌ఎన్‌పేట మండలం జాడుపేట గ్రామం సమీపంలో సరుబుజ్జిలికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు పొలంలోకి దూసుకెళ్లి ఒరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. స్టీరింగ్‌ లో సాంకేతిక సమస్య వల్ల బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ఉన్న ఏడుగురు విద్యార్థులను బయటకు తీసి అనంతరం జేసీబీతో బస్సును రోడ్డుపైకి తీసుకువచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని