భారత్‌ బంద్‌ను విజయవంతం చేద్దాం
eenadu telugu news
Published : 26/09/2021 05:53 IST

భారత్‌ బంద్‌ను విజయవంతం చేద్దాం

బంద్‌కు సంఘీభావం ప్రకటిస్తున్న అఖిలపక్ష నేతలు

పాతశ్రీకాకుళం, కలెక్టరేట్‌, గుజరాతీపేట, అరసవల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేద్దామని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ వలీ హాజరయ్యారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి, కాంగ్రెస్‌ జిల్లా ఇంఛార్జి జి.ఎ.నారాయణరావు, తెదేపా నాయకులు పీఎంజే బాబు, సీపీఎం సీనియర్‌ నాయకులు బి.కృష్ణమూర్తి, సీపీఐ నాయకులు తాండ్ర ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు. ● సీఐటీయూ అధ్వర్యంలో భారత్‌ బంద్‌కు సన్నాహకంగా చేపడుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, జిల్లా నాయకులు టి.తిరుపతిరావుతో సహా పలువురిని ర్యాలీ నిర్వహించకుండా నిలిపివేశారు. ● రైతు ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీకి ప్రధానమని, అందుకే ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ● భారత్‌ బంద్‌కు సహకరించాలంటూ ఆర్టీసీ డివిజనల్‌ మేనేజరు జి.వరలక్ష్మీను శనివారం ప్రజాసంఘాల నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఆ రోజు బస్సులు ఆపాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని