పిడుగులు పడి రెండు ప్రాణాలు బలి
eenadu telugu news
Published : 26/09/2021 05:53 IST

పిడుగులు పడి రెండు ప్రాణాలు బలి

గోపాలకృష్ణ (దాచిన చిత్రం)

భామిని గ్రామీణం, వంగర, న్యూస్‌టుడే: పిడుగుపాటుకు గురై శనివారం జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. భామిని మండలంలోని ఘనసరకు చెందిన కోటిలింగాల గోపాలకృష్ణ(51) పొలానికి వెళ్తుండగా అత్తికొత్తూరుకు సమీపంలోని ఓ చింతచెట్టు వద్దకు అతను చేరే సమయంలో పిడుగు పడటంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వర్షం తగ్గిన తరువాత చెట్టు వద్ద మృతదేహం ఉన్న విషయాన్ని గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. మృతుడికి భార్య, కుమార్తె, వృద్ధురాలైన ఉన్నారు. భార్యకు ఇటీవలే తలకు సంబంధించిన శస్త్ర చికిత్స చేశారు. కూరగాయలు పండించుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న గోపాలకృష్ణ అకాల మరణంతో ఆ కుటుంబం వీధిన పడింది. కొత్తూరు సీఐ సూర్యచంద్రమౌళి, బత్తిలి ఎస్‌.ఐ డి.అనిల్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని