సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్‌ పరీక్షలు
eenadu telugu news
Published : 28/09/2021 04:33 IST

సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్‌ పరీక్షలు

 

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: సచివాలయ ఉద్యోగులకు నిర్వహించే ప్రత్యేక సెషన్‌ డిపార్టుమెంటల్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిదిఫ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబరులో పరీక్షల నిర్వహణపై సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మూడు షిప్టుల్లో పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 9 నుంచి 11, రెండవ షిప్టు మధ్యాహ్నం 12.30 నుంచి 2.30, మూడవ షిప్టు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఉంటాయన్నారు. 28, 29, 30వ తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శి వసంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని