జిల్లాలో శాస్త్రవేత్తల పర్యటన
eenadu telugu news
Published : 28/09/2021 04:33 IST

జిల్లాలో శాస్త్రవేత్తల పర్యటన

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో మంగళవారం నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటిస్తారని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ ఎం.భరతలక్ష్మి సోమవారం ‘న్యూస్‌టుడే’కి తెలిపారు. గులాబ్‌ తుపాను కారణంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయన్నారు. చాలాచోట్ల ఎదిగిన చెరకు తోటలు నేలకొరిగాయని తెలిపారు. ఆలస్యంగా నాట్లు వేసిన వరి పంట ముంపునకు గురైందన్నారు. గాలులు అంతగా లేకపోవడం వల్ల పంటలు పెద్దగా పడిపోలేదన్నారు. ప్రతి జిల్లాలోని ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతోపాటు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను బృందాలుగా ఏర్పాటు చేసి నేరుగా పంటపొలాల వద్దకే పంపుతున్నామని చెప్పారు. వారు రైతులకు అక్కడికక్కడే సలహాలు అందిస్తారన్నారు. శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలను రైతులు ఆచరిస్తే నష్టాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవచ్చని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని