ఉప్పునీటి ముంపులో బీల
eenadu telugu news
Published : 28/09/2021 04:33 IST

ఉప్పునీటి ముంపులో బీల


లక్కవరం పరిధిలో మునిగిన పొలాలు

సముద్ర జలాలు చేరడంతో బీలప్రాంతంలో పంటపొలాలు ఉప్పునీటి ముంపునకు గురయ్యాయి. సోంపేట మండలం బారువ కంబప్రాంతం నుంచి కవిటి మండలం ఇద్దివానిపాలెం వరకు 18 కి.మీ. విస్తీర్ణంలో ప్రవహిస్తున్న బీలబట్టి ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఇద్దివానిపాలెం, ఒంటూరు పరిధిలో ఉప్పునీరు పొలాల్లోకి చేరుతోంది. తుపాను నేపథ్యంలో కురిసిన వర్షాలకు బీలకు చేరిన వరదనీటికి ఉప్పునీరు జతకలవడంతో చిన్నబీల, పెద్దబీల ప్రాంతాల్లో వేలాది ఎకరాల పంట నాశనమయ్యే పరిస్థితి నెలకొంది. ఉప్పునీరు బీలలో ప్రవేశించకుండా గతంలో ఏర్పాటు చేసిన షట్టర్‌లు నాశనమై ఏడేళ్లు కావస్తున్నా వాటిని మెరుగుపర్చకపోవడంతో పంటభూముల్లోకి ఉప్పునీరు చేరుతోంది. బీలబట్టి ఉద్దృతంగా ప్రవహించడం వరదనీరు సముద్రంలో కలిసేందుకు అవకాశం లేకపోవడంతో పంటపొలాల నుంచి నీరు కదలడం లేదు. బీలబట్టి పనులు చేపట్టి వరదనీరు సకాలంలో సముద్రంలోకి వెళ్లేలా చర్యలు చేపడితే తప్ప ఉప్పునీటి ముప్పు నుంచి పంటపొలాలకు రక్షణ దొరకదని రైతులు వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, సోంపేట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని