తాగునీటి కష్టాలు!
eenadu telugu news
Published : 28/09/2021 04:33 IST

తాగునీటి కష్టాలు!

తుపాను కారణంగా జిల్లాలో పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో తాగునీటికి ప్రజలు అవస్థలు పడ్డారు. పొందూరు మండలం తండ్యాం గ్రామంలో ఆదివారం రాత్రి నుంచి విద్యుత్తు నిలుపుదల చేయడంతో జనరేటర్‌తో తాగునీటి సరఫరా చేయడంతో గ్రామస్థులు తాగునీటి కోసం క్యూలు కట్టిన దృశ్యమే ఈ చిత్రం.

- న్యూస్‌టుడే, పొందూరు


చుట్టుముట్టిన సువర్ణముఖి

 

 

తుపాను వర్షాలతో సువర్ణముఖి నది ఉప్పొంగింది. దీంతో వంగర మండలం కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాల్లోకి సోమవారం అర్ధరాత్రి వరద నీరు ప్రవేశించింది. గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గీతనాపల్లి నుంచి ఓ బాలింత, బిడ్డను తీసుకెళుతున్న గ్రామస్థులను ఈ చిత్రాల్లో చూడొచ్చు.

- న్యూస్‌టుడే, వంగర


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని