నష్టాలపై నివేదిక అందజేయండి
eenadu telugu news
Published : 28/09/2021 04:33 IST

నష్టాలపై నివేదిక అందజేయండి


మబుగాంలో రైతులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన

మబుగాం (పోలాకి),న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలులకు దెబ్బతిన్న పంటలపై వెంటనే పరిశీలించి నష్టాలపై నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆయన మబుగాం, కత్తిరివానిపేట పరిసర గ్రామాల పొలాలను చెరకు, అరటి తోటలు చూశారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడుతూ నష్టానికి సంబంధించి వివరాలందితే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని