ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
eenadu telugu news
Published : 28/09/2021 04:47 IST

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన కృష్ణలంక జాతీయ రహదారిపై జరిగింది. కొల్లిపర వెంకటేశ్వరావు (67) భార్య మాణిక్యమ్మతో కలిసి రాణిగారితోట బాపనయ్యనగర్‌లో నివాసముంటున్నారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఆయన అల్లుడు కనిశెట్టి శ్రీనివాస్‌ లారీ డ్రైవర్‌. కోదాడలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిన వెంకటేశ్వరరావు తిరిగొచ్చే క్రమంలో అల్లుడు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్న లారీలో ఎక్కి ఆదివారం రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో కృష్ణలంక సమీపంలోని నేతాజీ వంతెన పరిసరాల్లో దిగారు. రోడ్డు దాటి ఇంటికెళుతుండగా పలాస నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు వెంకటేశ్వరరావును ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనాస్థలంలోనే మృతిచెందారు. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని