తుపాను వస్తోందని తెలియలేదా..
eenadu telugu news
Published : 28/09/2021 05:36 IST

తుపాను వస్తోందని తెలియలేదా..

బాధితులకు మంత్రి పరామర్శ


పలాసలో బోటు ప్రమాద బాధితులతో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

పలాస, వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తుపాను వస్తోందని మీకు తెలియదా అంటూ మంత్రి అప్పలరాజు సురక్షితంగా బయటపడిన మత్స్యకారులను ప్రశ్నించారు. సోమవారం వారితో మంత్రి మాట్లాడారు. తుపాన్‌ వస్తోందని విషయం తమకు తెలియదని వారు వివరించారు. అంతకుముందు మంత్రి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో పురపాలక సంఘం అధ్యక్షుడు బి.గిరిబాబు, వ్యవసాయ మార్కెట్‌కమిటీ అధ్యక్షుడు పి.వి.సతీష్‌, ఎంపీపీలు ఉంగ ప్రవీణ, డి.దానయ్య, పి.శ్రావణి, కమిషనర్‌ టి.రాజగోపాలరావు పాల్గొన్నారు. ● పూడిలంక ఇబ్బందులను తెలుసుకున్నామని, గ్రామానికి ఆగిపోయిన రహదారిని పూర్తిచేసి త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. గట్టు స్వల్పంగా దెబ్బతినడంతో ప్రత్యామ్నాయంగా రాకపోకలకు బోటు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టెక్కలి సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ ఆయా గ్రామాలను సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని