25,274 మందికి జగనన్న తోడు
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

25,274 మందికి జగనన్న తోడు


లబ్ధిదారులకు చెక్కు అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు, తదితరులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా 25,274 మంది లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం దూరదృశ్య సమావేశం నిర్వహించి పథకం నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నతోడు ద్వారా రూ.1.28 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.47.36 లక్షలు అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం రణస్థలం మండలం సీహెచ్‌ రాజాం గ్రామానికి చెందిన పి.పద్మ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సాయంతో చిల్లర వ్యాపారం నుంచి స్థిర వ్యాపారం చేసుకునే స్థాయికి చేరుకున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు, జడ్పీ అధ్యక్షురాలు పి.విజయ, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జేసీలు కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములునాయుడు, డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఎం.శ్రీకాంత్‌, ఎ.సూరిబాబు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని