26న డీఆర్‌సీసమావేశం
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

26న డీఆర్‌సీసమావేశం

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధి మండలి సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని