వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం


వాల్మీకి చిత్రపటానికి డీఐజీ రంగారావు నివాళి

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: వాల్మీకి జీవితం నేటికీ అందరికీ ఆదర్శమని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి.రంగారావు అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌ బర్దార్‌, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు వీరకుమార్‌, శేఖర్‌, దుర్గా ప్రసాద్‌, ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ● వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశమందిరంలో వాల్మీకి జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు. స్పీకర్‌ సీతారాం, జడ్పీ అధ్యక్షురాలు పి.విజయ, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, తదితరులు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల్లో పని చేస్తూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని 12 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఎ.సూరిబాబు, ఎం.శ్రీకాంత్‌, జేసీ ఆర్‌.శ్రీరాములునాయుడు, డీఆర్వో బి.దయానిధి, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని