హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండు
eenadu telugu news
Published : 21/10/2021 06:10 IST

హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండు


ఏడు రోడ్ల కూడలి వద్ద ధర్నాలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధులు

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. అక్కడ హిందూ దేవతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నగరంలో ఏడు రోడ్ల కూడలి వద్ద వీహెచ్‌పీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జిహాది తీవ్రవాది దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కలెక్టర్‌ ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించినట్లు వీహెచ్‌పీ ప్రతినిధులు నిరంజనానంద స్వామీజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌.ఫల్గుణరావు, పొగిరి సూర్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించేటట్లు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గుంటుకు సాయిరాం, మధుసూదనరావు శ్రీరంగం, భాజపా నాయకులు పూడి తిరుపతిరావు, అట్టాడ రవిబాబ్జీ, వీహెచ్‌పీ జిల్లా సహకార్యదర్శి గేదెల చంద్రశేఖర్‌, టంకాల సూరప్పడు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని